సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియాచక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది. కాగా రియాచక్రవర్తిని సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా తడబడ్డట్టు సమాచారం. రియా చెబుతున్న సమాధానాలతో సీబీఐ అధికారులే షాక్‌కు గురవుతున్నారట. అక్కడ ఆమె ప్రతి ప్రశ్నకు నాకేం తెలియదు అని సమాధానం చెబుతుండటంతో ఆమె నటనకు షాక్ అవుతున్నారట. ముఖ్యమైన ప్రశ్నలన్నింటికి ఆమె సమాధానం చెప్పకుండా దాటవేస్తుందట. దీంతో సీబీఐ అధికారులకు ఆమెపై అనుమానాలు బలపడుతున్నాయి. సీబీఐ అధికారులు ఆమెను 50 ప్రశ్నలు అడుగగా ఆమె కేవలం రెండింటికే సమాధానం చెప్పిందట. ఆదివారం ఆమెను సీబీఐ అధికారులు మరోసారి విచారించనున్నారు. సుశాంత్‌తో మీరు ఎప్పడు బ్రేకప్ చేసుకున్నారు? అని సీబీఐ ప్రశ్నించగా.. జూన్ 8న బ్రేకప్ చేసుకున్నట్టు రియా చెప్పిందట. అయితే మీరు ఏకారణంతో విడిపోయారు? విడిపోయాక కూడా సుశాంత్ మీ సోదరుడికి ఎందుకు కాల్ చేశారు? జూన్ 8న మీరు విడిపోతే జూన్ 14 వరకు అతడి గురించి ఎందుకు పట్టించుకున్నారు? తదితర ప్రశ్నలు సీబీఐ అడిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు రియా దాటవేత దోరణినితో సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం.