Breaking News

రాజ్యసభలో పెరిగిన వైఎస్సార్‌సీపీ బలం


సారథి న్యూస్, అనంతపురం: వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు ఎన్నికల్లో ఘన విజయం ఆ పార్టీ బలం రాజ్యసభలో ఆరుకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీలో మొత్తం 175 ఓట్లు ఉండడంతో గెలిచేందుకు 36 ఓట్లు అవసరమవుతాయి. అయితే 173 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కె.అచ్చెన్నాయుడు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరోవైపు పోలైన వాటిలో కూడా నలుగురి ఓట్లు చెల్లలేదు. దీంతో గెలిచేందుకు ఒక్కో అభ్యర్థికి 34 ఓట్లు అవసరమయ్యాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు తోడు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా మద్దతివ్వడంతో అధికార పార్టీకి 152 ఓట్లు పడ్డాయి. కాగా, ఇప్పటికే సి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్​రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.