సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి కేటీఆర్.. తన జన్మదినం సందర్భంగా ప్రభుత్వానికి ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంబులెన్స్‌లను గురువారం హైదరాబాద్‌లో ప్రగతి భవన్లో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. కాగా మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు వందకు పైగా అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, బాల్క సుమన్, కేటీఆర్ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య పాల్గొన్నారు.
- July 30, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- AMBULANCE
- BIRTHDAY
- ETALA
- HYDERABAD
- KTR
- అంబులెన్స్‌లు
- కేటీఆర్
- Comments Off on మాట నిలుపుకున్న కేటీఆర్