సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. కరోనా భారిన పడ్డ రాజకీయనాయకులు, సెలబ్రిటీల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మల్లారెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. గతంలో హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వారంతా కార్పొరేట్ ఆస్పత్రుల్తో చికిత్స తీసుకొని కోలుకున్నారు.
- August 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- MALLAREDDY
- MINISTER
- TELANGANA
- తెలంగాణ
- మల్లారెడ్డి
- Comments Off on మంత్రి మల్లారెడ్డికి కరోనా