న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని.. కాంగ్రెస్ బహిష్కృత నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్‌పార్టీ అతడిపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షపదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో సచిన్ పైలట్ ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సరైన వ్యూహం లేకుండా ముందుకు వెళ్లడంతో సచిన్ పైలట్ బొక్కబోర్లా పడ్డారని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వెళ్లే ముందు ఆయన సరైన వ్యూహం రచించలేదన్న విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఆవేశంతో బయటకు వెళ్లిన సచిన్‌కు ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ అధినాయకత్వం రెండూ ఆయనకు చెయ్యిచ్చాయి. రాజస్థాన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మంగా వ్యవహరించి రాజస్థాన్‌లో ప్రస్తుతానికైతే ముప్పు నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం సీఎం అశోక్ గెహ్లాట్ చేతిలో మ్యాజిక్ ఫిగర్‌కు కావల్సిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. సచిన్ పైలట్ ఎటువంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.