సారథి న్యూస్, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్‌శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఈఎన్సీ ఎం.సత్యనారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెకర్ కుమార్ దీపక్, పంచాయతిరాజ్ శాఖ ఈఈ మునిరాజ్, రామగుండం తహసీల్దార్ తూము రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
- August 24, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BHARATHI
- CM KCR
- COLLECTOR
- HYDERABAD
- PEDDAPALLY COLLECTOR
- TELANGANA
- కలెక్టర్
- పెద్దపల్లి
- భారతీహోలికేరీ
- రైతువేదికలు
- Comments Off on ప్రణాళికాబద్దంగా రైతువేదికలు