Breaking News

పెళ్లి రోజు.. రూపాయికే క్వార్టర్​ మందు!

పెళ్లి రోజు.. క్వార్టర్​ మద్యం పంపిణీ!

సారథి న్యూస్, మానవపాడు: సినీ హీరోలు, దర్శకులపై అభిమానులకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. సాధారణంగా పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు, వస్ర్తాలను పంపిణీ చేయడం పరిపాటి. అయితే ఓ సినీ డైరెక్టర్​ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యాన్స్​ వినూత్న కార్యక్రమం చేపట్టారు. రూపాయికే క్వార్టర్ మద్యం అందజేసి.. అన్నదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు. సినీ డైరెక్టర్ ​ఎన్.శంకర్ పెళ్లిరోజు వేడుకను అభిమానులు ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో కోలాహలంగా జరుపుకున్నారు. అలంపూర్ బస్టాండ్ ఆవరణలో రెండొందల మందికి అన్నదానం చేశారు. ఒక్క రూపాయికే క్వార్టర్​ మద్యం పంపిణీ చేశారు. సినీ డైరెక్టర్​ శంకర్​పై ఉన్న అభిమానంతో, అభిమానుల కోరిక మేరకే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మద్యం కొనుగోలు చేస్తున్న అభిమానులు