ఢిల్లీ: నూతన విద్యావిధానంతో మన దేశంలో పెనుమార్పులు సంభవించనున్నాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నూతన విద్యావిధానంతో విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇక విద్యార్థులు వారికి ఇష్టమైన కోర్సును చిన్నప్పడే ఎంచుకోవచ్చని.. హోంవర్కులు, పుస్తకాల మోత ఉండబోదని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో ఈ కొత్త విద్యా విధానం అమల్లోకి రానుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుందని.. నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుందన్నారు. సృజనాత్మకత నిశిత పరిశీలన పెంపొందుతుందన్నారు. విస్తృత అధ్యయనం తర్వాత ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కొత్త విద్యా విధానంపై ఎవరికీ అపోహలు అవసరం లేదని భవిష్యత్తు లక్ష్యాలకు విద్యార్థులు సిద్ధం చేయడానికి విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
- August 7, 2020
- Archive
- Top News
- జాతీయం
- INDIA
- MODI
- PM
- SPEECH
- ఇండియా
- ప్రధానిమోదీ
- విద్యావిధానం
- Comments Off on పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది