సారథి న్యూస్, హుస్నాబాద్: అభివృద్ధి కోసం అవసరమైతే రాజకీయాలను పక్కన పెడతానని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. వానాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు శ్రీనివాస్, వేణు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ పాల్ రెడ్డి, నాలుగు మండలాల అధ్యక్షులు వీరాచారి, వెంకటేశ్, చిరంజీవి, శంకర్ బాబు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి తిరుమల, మోహన్ నాయక్, సాగర్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
- June 12, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BANDISANJAY
- BJP
- HYDERABAD
- KARIMNAGAR
- డ్రైనేజీ
- సీసీరోడ్లు
- Comments Off on పార్టీకాదు..అభివృద్ధే ముఖ్యం