సారథి న్యూస్, శ్రీకాకుళం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన పంచారామాలకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డీఎం వరలక్ష్మి తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను సోమవారం శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు వివరించారు. ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర పరిష్కారాల దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఏఎంఎస్ శ్రీనివాస్ రావు, ఆర్సీజీ వెంకటేశ్వర రావు, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
- November 16, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- KARTHIKAM
- PANCHARAMALU
- RTC BUSES
- TUNGABADRA PUSHKARALU
- అమరావతి
- ఆర్టీసీ బస్సులు
- కార్తీకమాసం
- తుంగభద్ర పుష్కరాలు
- పంచారామాలు
- Comments Off on పంచారామాలకు స్పెషల్ బస్సులు