Breaking News

నాణ్యమైన బంతి అయితే ఓకే

న్యూఢిల్లీ: బంతి నాణ్యంగా ఉంటే బౌలర్లు స్వింగ్ రాబట్టొచ్చని డ్యూక్స్ బంతుల తయారీ సంస్థ యజమాని దిలీప్ జజోడియా చెప్పాడు. అప్పుడు బంతి రంగు కోసం ఉమ్మి వాడాల్సిన పనిలేదన్నాడు. ‘బంతి ఆకారం దెబ్బతిన్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తొందరగా ఆకారం కోల్పోయే కుకా బుర్రా, ఎస్జీ బంతులు వాడే భారత్, ఆస్ట్రేలియా మాత్రమే ఉమ్మికి ప్రత్యామ్నాయం కోరుతున్నాయి. స్వింగ్ రాబట్టాలంటే బంతికి మెరుపు మాత్రమే సరిపోదు. గట్టిదనం, ఆకారం, తగిన సీమ్ ఉండాలి. బంతిని పట్టుకునే నైపుణ్యం బౌలర్​కు ఉండాలి. ఈ లక్షణాల్లేని బంతులు వాడినప్పుడు మాత్రమే స్వింగ్ కోసం వేరే వాటిపై ఆధారపడతాం’ అని జజోడియా వ్యాఖ్యానించాడు.