సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్33, భద్రాద్రి కొత్తగూడెం 95, జగిత్యాల 64, జనగామ 38, జోగుళాంబ గద్వాల జిల్లా 22, కామారెడ్డి 76, కరీంనగర్ 157, ఖమ్మం 116, మహబూబ్నగర్ 45, మహబూబాబాద్ 71, మంచిర్యాల 69, మెదక్ 36, మేడ్చల్ మల్కాజిగిరి 132, ములుగు 20, నాగర్కర్నూల్ 53, నల్లగొండ 105, నిర్మల్34, నిజామాబాద్102, పెద్దపల్లి 68, రాజన్నసిరిసిల్ల 64, రంగారెడ్డి 191, సంగారెడ్డి 37, సిద్దిపేట 89, సూర్యాపేట 101, వనపర్తి 40, వరంగల్అర్బన్ 91, యాద్రాద్రి భువనగిరి 57 చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు హెల్త్బులెటిన్ను విడుదల చేశారు.
- September 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ACTIVECASES
- CARONA
- COVID19
- GHMC
- TELANGANA
- ఐసోలేషన్
- కరోనా
- కోవిడ్19
- తెలంగాణ
- యాక్టివ్కేసులు
- Comments Off on తెలంగాణలో 2,392 కరోనా కేసులు