Breaking News

తెలంగాణలో 1,682 కరోనా కేసులు

తెలంగాణలో 1,682 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,682 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 93,937 మొత్తం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 711కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నుంచి కోలుకుని 2,070 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 72,202కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,024 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తంగా 7,72,928 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 76.86 శాతంగా నమోదైంది. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 235 కేసులు నిర్ధారణ అయ్యాయి.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం 27, జగత్యాల 59, జనగాం 32, జోగుళాంబ గద్వాల 69, కామారెడ్డి 44, కరీంనగర్​88, ఖమ్మం 45, మహబూబ్​నగర్​32, మంచిర్యాల 79, మెదక్​36, మేడ్చల్ మల్కాజిగిరి​106, నాగర్​కర్నూల్​ 30, నల్లగొండ 38, నిర్మల్​27, నిజామాబాద్ ​94, రంగారెడ్డి 166, సిద్దిపేట 47, సూర్యాపేట 39 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.