సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,550 పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 36,221 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది చనిపోగా, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 365కు చేరింది. వైద్యం అనంతరం 23,679 మంది ఇప్పటిదాకా డిశ్చార్జ్అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 926 అత్యధికంగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్53, సంగారెడ్డి 19, ఖమ్మం 38, కామారెడ్డి 33, వరంగల్ అర్బన్ 16, కరీంనగర్ 86, నల్లగొండ 41, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో 13 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
- July 13, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- CASES
- HYDERABAD
- కరోనా
- జీహెచ్ఎంసీ
- తెలంగాణ
- Comments Off on తెలంగాణలో 1,550 కేసులు