సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 29,536 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 992 మంది డిశ్చార్జ్కాగా, ఇప్పటివరకు 17,279 మంది కోలుకున్నారు. తాజాగా 11 మందితో కలిపి మొత్తంగా 324 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇప్పటివరకు 1,34,801 టెస్టులు చేశారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 99, మేడ్చల్ నుంచి 43, మహబూబ్ నగర్ 15, వరంగల్ రూరల్ 26, సంగారెడ్డి జిల్లాలో 20, నిజామాబాద్ జిల్లాలో 19, నల్లగొండ 13, వికారాబాద్జిల్లాలో 11 చొప్పున కేసులు నమోదయ్యాయి.