ఎప్పుడూ కూల్‌గా ఉండే సంగీత దర్శకుడు తమన్ ఓ చిన్న ట్వీట్‌తో చిక్కుల్లో పడ్డాడు. ఆయన ట్విట్టర్లో వాడిన ఓ మాట మహేశ్ బాబు అభిమానులకు కోపం తెప్పించింది. ఆయనపై మహేశ్‌బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. పచ్చిబూతులతో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇంతకు వాళ్ల కోపానికి కారణం ఏమిటంటే.. ఈనెల 9న సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు.. ట్విట్టర్లో ఓ పోస్టుపెట్టాడు. తన పుట్టినరోజుకు అభిమానులు భారీగా గుమిగూడవద్దని, కరోనా విపత్తువేళ ఇండ్లవద్దే ఉండి వేడుకలను జరుపుకోవాలని ఆ ట్వీట్ సారాంశం.
ఈ ట్వీట్‌పై తమన్ స్పందిస్తూ ‘మంచి నిర్ణయం బ్రదర్’ అంటూ రీ ట్వీట్చేశాడు. దీంతో రెచ్చిపోయిన మహేశ్ అభిమానులు మా హీరోను బ్రదర్ అంటావా.. నీకు ఎన్ని గుండెలు. నువ్వెంత నీ స్థాయి ఎంత.. వెంటనే ఆయనకు క్షమాపన చెప్పు. లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కొంటావు. స్టార్హీరో మహేశ్‌బాబును.. నువ్వు ‘సర్’ అని సంబోధించాలి. అంతేకాని బ్రదర్ అంటావా? అని విరుచుకుపడ్డారు. అభిమానులు చిన్న విషయానికే రాద్దాంతం చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఎప్పడూ ‘సర్’ అని సంబోధించే తమన్ ఇప్పడు మహేశ్‌బాబును బ్రదర్ అని పిలిచి అవమానించాడని వారు వాదిస్తున్నారు. ఈ దుమారం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి.