ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, తండ్రి చిరంజీవి ‘ఆచార్య’మూవీలో కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడని కన్ఫామ్ అయ్యింది. అయితే దాని నిర్మాణ బాధ్యతలు చరణే చూసుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పటి నుంచో లిస్ట్‌లో ఉన్నా.. వీటి తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అన్న విషయం పై చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. దీని గురించి చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు వారి లిస్టులో నుంచి
‘ఛలో, భీష్మ’వంటి చిత్రాలు తెరకెక్కించిన వెంకీ కుడుముల పేరు వినిపిస్తోంది. ఆయన చరణ్ కోసం ఓ స్టోరీని రెడీ చేశాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని..ఆల్రెడీ కథను చరణ్ కి వినిపించాడని దానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. తన పాత్రలోని కొత్తదనం నచ్చడంతో చరణ్ ఓకే అన్నాడని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి రానున్నట్లుగా తెలిసింది