సారథి న్యూస్, నెట్వర్క్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. భాగ్యనగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. సరూర్నగర్చెరువు ఉప్పొంగింది. వరద ప్రళయమే సృష్టించింది. వరద ఉధృతికి కార్లు కొట్టుకొచ్చాయి.
ఆ గల్లీ.. ఈ గల్లీ.. ఏది చూసినా జలసంద్రమైంది. అలాగే రాష్ట్రంలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి చేలు నీట మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి.