సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణలో ఇటీవల మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటంతో పోలీస్‌శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు ఓకే రోజు అదృశ్యమయ్యారు. అయితే వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? వీరు అడవి బాటపట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి(గొత్తికోయ కాలనీ) చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ నుంచి కనిపించకుండా పోయారు. అందులో ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పంజా దేవా అనే వ్యక్తి వీరిని తీసుకెళ్లినట్టు యువతి తండ్రి ఆదివారం రాత్రి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ముగ్గురు యువతుల్లో ఒకరు మైనర్ ఉన్నట్టు సమాచారం.
- September 21, 2020
- Archive
- Top News
- ఖమ్మం
- ANDHRAPRADESH
- HYDERABAD
- KAMMAM
- KCR
- POLICE
- TELNGANA
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- పోలీస్
- మావోయిస్టులు
- సీఎం కేసీఆర్
- Comments Off on గిరిజన యువతుల మిస్సింగ్.. కలకలం