ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటున్నదని వైద్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు భారత్లో 8 లక్షల మంది కోరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో 49,310 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 12,87,945 లకు ఎగబాకింది. ఇప్పటివరకు 30,601 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,40,135 యాక్టివ్ కేసులున్నాయి.