సారథి న్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూచట్టంతో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అధికారుల అవినీతికి చెక్ పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆదివారం రామగుండం, పాలకుర్తి, అంతర్గాం నుంచి గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీని ఎమ్మెల్యే చందర్, ఎంపీ వెంకటేశ్ నేతకాని ప్రారంభించారు. ర్యాలీలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు చాగంటి శంకర్, పాత పెళ్లి లక్ష్మీ ఎల్లయ్య, కుమ్ము వేణుగోపాల్, కుమ్మరి శ్రీనివాస్, కే కృష్ణవేణి భూమయ్య, కే సరూప శ్రీనివాస్ , గొల్లపూడి రమాదేవి శ్రీనివాస్ గౌడ్, ధాతు శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, వాము కుంట్ల భాస్కర్, టిఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్, మారుతి, బాలరాజు, కే లక్ష్మీనారాయణ, అచ్చ వేణు, దేవరాజు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు.