సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. శనివారం కొత్తగా 1,284 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 43,780 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,902 మంది రికవరీ అయ్యారు. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 430 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 667, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, వరంగల్అర్బన్37, కరీంనగర్58, యాదాద్రి భువనగిరి 10, పెద్దపల్లి 14, మెదక్15, మహబూబ్‌నగర్16, మంచిర్యాల 19, నల్లగొండ 46, వికారాబాద్35, నిజామాబాద్26, వనపర్తి 24, సిద్దిపేట 22, సూర్యాపేట 23, జోగుళాంబ గద్వాల జిల్లాలో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యాశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.