సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అపురూపమైన కానుకను అందజేశారు. కేటీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయం, కెరియర్ విజయాలు, ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలు, ప్రజల కోసం చేసిన పోరాటాలు, హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని వివరిస్తున్న దృశ్యమాలికలతో పెయింటింగ్ వేయించారు. ఈ చిత్రాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన కుమారులు సాయికిరణ్, సాయితేజ, చిత్రకారుడు వెంకటేష్ తో కలిసి ప్రగతి భవన్ లో అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అభినందించారు.
- July 24, 2020
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- KTR
- TELANGANA
- TRS
- కేటీఆర్
- తెలంగాణ
- బర్త్‌డే
- హైదరాబాద్
- Comments Off on కేటీఆర్‌కు అరుదైన కానుక