సారథి న్యూస్, కర్నూలు: ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. 71వ వనమహోత్సవం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా బుధవారం సామాజిక వనవిభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగర శివారులోని వెంగన్నబావి విజయవనం వనమహోత్సవంలో కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టన్ షెట్టి, కర్నూలు అటవీశాఖ కన్జర్వేటర్ రామకృష్ణ, డీఎఫ్వో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం రుద్రవరం గ్రామ సమీపంలోని పేదకు పంపిణీ చేయనున్న ఇంటి స్థలాల రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. కలెక్టర్ జి.వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేసీ రవిపట్టన్ షెట్టి, కర్నూలు కమిషనర్డీకే బాలాజీ డ్వామా పీడీ మురళీ, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
- July 22, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- CM JAGAN
- HARITHAHARAM
- Kurnool
- కర్నూలు
- కలెక్టర్
- హరితహారం
- Comments Off on కాలుష్యాన్ని తరిమేద్దాం