సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం 1,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 32,224 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 12,680 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా 10,354 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, అందులో 9,076 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో 762 కేసులు, రంగారెడ్డిలో 171 కేసుల చొప్పున మేడ్చల్ 85, సంగారెడ్డి 35, ఖమ్మం 18, కామారెడ్డి 23, నల్లగొండ 32, మెదక్22 చొప్పున కేసులు నమోదయ్యాయి.
- July 10, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CAROONA
- POSITIVE CASES
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on ఒకేరోజు 1,278 కేసులు