అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 10,276 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధిబారినపడి ఒకేరోజు 97 మంది మృతిచెందారు. మహమ్మారితో ఇప్పటివరకు 3,189 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. గత 24 గంటల్లో కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 61,469 మందికి పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 31,91,326 మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 1,020, చిత్తూరు 1,220, ఈస్ట్‌గోదావరి 1,321, గుంటూరు 719, కడప 539, కృష్ణా 232, కర్నూలు 850, నెల్లూరు 943, ప్రకాశం 693, శ్రీకాకుళం 661, విశాఖపట్నం 540, విజయనగరం 505, వెస్ట్‌గోదావరి 1,033 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేసింది.