Breaking News

ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా

సారథిన్యూస్​, కడప: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అంజద్​ బాషా హోంక్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రేపటి నుంచి 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహనిర్బందంలో ఉండనున్నారు. ఆయనకు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజద్​బాషాకు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు తేలింది.