సారథి న్యూస్, రామగుండం: మానవత్వం మంటగలుస్తున్న నేటి పరిస్థితిల్లో మానవీయతను చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనార్థులకు అసరాగా, అనాథలకు అదుకోవడమే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం గోదావరిఖని పట్టణంలోని స్థానిక చౌరస్తాలో ఓ అనాథ వృద్ధురాలిని తన వాహనంలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాంధీనగర్ లో చెత్తకుండిలో పక్కన ఉన్న ఓ వృద్దురాలిని షెల్టర్‌కు తరలించి మానవీయతను చాటుకున్నారు. మంత్రి కె.తారక రామారావు స్ఫూర్తితోనే తాను పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఎమ్మెల్యే కోరుకంటి ప్రకటించారు.
- August 29, 2020
- Archive
- Top News
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- GODAVARIKHANI
- MLA KORUKANTI
- PEDDAPALLY
- RAMAGUNDAM
- ఎమ్మెల్యే కోరుకంటి
- గోదావరిఖని
- పెద్దపల్లి
- రామగుండం
- Comments Off on ఎమ్మెల్యే.. మానవతా హృదయం