ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రముఖ సినీ నిర్మాత దివంగత ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్‌కు కొంత కాలంగా తీవ్రమైన ఘర్షణ జరుగుతున్నది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు కేసులు పెట్టుకొనే స్థాయిలో గొడవపడ్డారు. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణమేమీటోనని సినీవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్ చెన్నైలోని తన స్టూడియోలో ఓ పెద్ద గదిని ఇళయరాజాకు బహుమతిగా ఇచ్చారు. ఆ గదిలోనే ఇళయరాజా మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటుచేసుకొని .. దాన్ని వాడుకుంటున్నారు. అయితే ఎల్వీ ప్రసాద్ మరణాంతరం స్టూడియో బాధ్యతలు చేపట్టిన రమేశ్ ప్రసాద్ ఇళయరాజాకు అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఆయన స్టూడియోను అక్కడే కొనసాగించారు. కానీ ఇప్పడు స్టూడియో బాధ్యతలు చేపట్టిన రమేష్ ప్రసాద్ తనయుడు సాయి ప్రసాద్ కు ఇళయరాజాతో బేదాభిప్రాయాలు వచ్చాయి. ఇళయరాజాను అక్కడి నుంచి పంపించివేయాలని ఆయనను సూటిపోటి మాటలు అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై ఇద్దరికి గొడవలు జరుగుతన్నాయి. సాయి ప్రసాద్ తనను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఇళయరాజా కోర్టుకు వెళ్లాడు. కేసు కోర్టులో ఉండగానే సాయిప్రసాద్.. ఇళయరాజాకు కేటాయించిన గది తాళం పగులగొట్టి అందులోని సంగీత వాద్య పరికరాలను ధ్వంసం చేశాడు. దీంతో ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంను తమిళ సినీ పెద్దలు పరిష్కరించాలంటూ కొందరు కోరుతున్నారు. సినీపెద్దలెవరైనా కలుగచేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- August 2, 2020
- Archive
- Top News
- సినిమా
- CHENNAI
- ILAYARAJA
- PRASAD
- PRODUCER
- ఇళయరాజా
- ఎల్వీ ప్రసాద్
- Comments Off on ఇళయరాజా x ప్రసాద్.. బిగ్‌వార్