Breaking News

ఇండిపెండెంట్ ‘డబుల్’ ఇళ్లకు రూ.5లక్షల సాయం

ఇండిపెండెంట్ డబుల్ ఇళ్లకు రూ.5లక్షల సాయం

సారథి న్యూస్, రామయంపేట: రాబోయే రోజుల్లో ఇల్లు లేక సొంత జాగా కలిగి ఉన్న వారికి రూ.ఐదు లక్షల వ్యయంతో నిర్మించబోయే డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణంలో కె.వెంకటాపూర్ కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలంలోని కె.వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో భక్తిభావం విరసిల్లాలని ఆమె అన్నారు. అలాగే అలయ అభివృద్దికి తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, ఎంపీపీ సిద్ధరాములు, జడ్పీటీసీ విజయ్ కుమార్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మీ, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.

ఆలయంలో వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకుంటున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి