సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణ డిప్యూటీ హోం మినిస్టర్మహమూద్అలీ సూచించారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే పండుగను ముస్లిం సోదరులు ప్రత్యేక జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. బక్రీద్ సందర్భంగా బలిచ్చే పశువుల వ్యర్థాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ అధికారులు హోంమంత్రి దృష్టికి తెచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్ కుమార్, జోనల్ అధికారులు రవికిరణ్, మమత, శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
- July 29, 2020
- Archive
- తెలంగాణ
- BAKRID
- CARONA
- HYDERABAD
- TELANGANA
- కరోనా
- ప్రార్థనలు
- బక్రీద్
- హైదరాబాద్
- Comments Off on ఇంట్లోనే బక్రీద్ ప్రార్థనలు