సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కరోనా నివారణకు ఆశా కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని నాగర్‌కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ప్రశంసించారు. గురువారం కలెక్టరేట్లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను సబ్బులు, శానిటైజర్లు, ఫ్రూట్‌జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ.. కరోనా నివారణకు వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వైద్యసేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రమేశ్‌రెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డి.కుమార్, బ్లడ్ డొనేషన్ కన్వీనర్ రాజ్ కుమార్, నాగర్ కర్నూల్ మండల వైద్యాధికారి డాక్టర్ దశరథం, రెడ్ క్రాస్ సభ్యులు కృష్ణారావు, రమాదేవి, కేశవులు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
- October 8, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- ANDHRAPRADESH
- ASHA
- CARONA
- HYDERABAD
- MAHABUBNAGAR
- TELANGANA
- ఆశకార్యకర్తలు
- కరోనా
- Comments Off on ఆశా కార్యకర్తల కృషి అద్భుతం