Breaking News

డ్రైవర్ కుటుంబానికి న్యాయం జరిగేనా..?

సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి డీఈఓ రవీందర్ బరితెగించాడు.తన ఆఫీస్ కు పెట్టిన అద్దె కారును రూల్స్ కు విరుద్దంగా వాడుకోవడమే గాకుండా ఈ విషయాన్ని మీడియాకు చెప్పారన్న అక్కసుతో నిరుపేద కుటుంభానికి చెందిన డ్రైవర్ బాలస్వామి పై తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు.రెండేళ్లగా డీఈఓ ఆఫీస్ కు అద్దెకు పెట్టిన కారు అగ్రిమెంట్ పేపర్లు కూడా డ్రైవర్ కు ఇవ్వకుండా వేధించసాగాడు. తనపైనే మీడియాకు, జిల్లా కలెక్టర్ కు , వనపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఈ నెల 12న అద్దె కారును డ్రైవర్ బాలస్వామి కి వనపర్తి లో తిరిగి అప్పజెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్దె కారును వాడకుండా కారు కావాలని డ్రైవర్ ను అడగకుండా డీఈఓ రవీందర్ తన స్వంత కారులో మహబూబ్ నగర్ నుంచి డ్యూటీ చేయడం ప్రారంభించాడు.
డీఈఓ అరాచకాలపై జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు…
వనపర్తి డీఈఓ అరాచకాలపై అలిసిపోయిన డ్రైవర్ బాలస్వామి సోమవారం జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి కి ఫిర్యాదు చేశారు. గత రెండేళ్లుగా డీఈఓ రవీందర్ తన కొత్త షిప్ట్ డిజైర్ కారును తన స్వంత కారులాగ వాడుకుంటూ నాశనం చేశాడని ఎస్పీ కి తెలిపారు. 24 గంటలు అద్దె కారును తన వద్దే ఉంచుకుంటూ కారును పూర్తిగా డ్యామేజ్ చేయడంతో పాటు మానసికంగా, ఆర్థికంగా నష్టపోయేలా చేశాడని చెప్పారు.

డీఈఓ అరాచకాలకు తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని మంచం పట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని మీడియా, పోలీసులకు ఫిర్యాదు చేశానన్న కక్ష్యతో అద్దె కారును డీఈఓ రవీందర్ వాపస్ పంపించి మరింత మానసిక క్షోభ కు గురిచేస్తున్నారన్నారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వాపస్ తీసుకోవాలని తనను డీఈఓ రవీందర్, ఏడీ నరహరి, సీనియర్ అసిస్టెంట్ విష్ణు లు ప్రతి రోజు వేదిస్తు మానసికంగా హింసిస్తున్నారని ఎస్పీ కి వివరించారు. తనను ఇబ్బందులు పెట్టిన డీఈఓ రవీందర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ని కోరారు. ఈ విషయం పై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వనపర్తి ఇంచార్జీ సీఐ శ్రీనివాస్ రెడ్డి ని ఎస్పీ ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న డీఈఓ రవీందర్ పై ఇన్ని ఫిర్యాదులు వస్తున్నా అటు జిల్లా అధికారులు స్పందించక పోవడం, అధికార పార్టీ నాయకులు అండగా ఉంటుండడంతో ఇప్పటికైనా డ్రైవర్ బాలస్వామి కుటుంభానికి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సీందే.