- ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్
సామాజిక సారథి, సంగారెడ్డి: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండువేలకోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు రూ.20వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన సతీమణిని ఎమ్మెల్సీ ఎన్నికల పోటీనుంచి విత్ డ్రా చేయిస్తానని హరీశ్‌రావుకు ఛాలెంజ్ విసిరారు. నిర్మలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు రూ.20వేల కోట్లు తీసుకొస్తానని ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయని, కానీ వారికి పవర్ లేదన్నారు. పూర్వ మెదక్ జిల్లా నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా నిధులు శూన్యమన్నారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు హరీశ్ రావు అందుబాటులో ఉంటారని ఆయన విమర్శించారు.