- కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు
సామాజిక సారథి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం అన్నారు. అసలు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా వనమా వెంకటేశ్వర రావుతో రాజీనామా చేయిస్తే ప్రజలు హర్షిస్తారు కదా అన్నారు. వనమా రాఘవేంద్ర నయీంను మించి పోయాడని, అసైన్డ్, ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడని ఆరోపించారు. వనమా రాఘవేంద్ర ఆక్రమించిన భూములను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.