సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రమంత్రులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, తదితర అంశాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- February 5, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- CM KCR
- KTR
- PRAGATHIBHAVAN
- TELANGANA
- TRS
- కేటీఆర్
- టీఆర్ఎస్
- తెలంగాణ
- ప్రగతిభవన్
- సీఎం కేసీఆర్
- Comments Off on 7న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం