Breaking News

ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

ప్రజాస్వామ్యానికి ఓటే బలమైన పునాది

  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23 వ వార్డులోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ లో ని 69 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుందని, కరోనాను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచినట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుందన్నారు. అభివృద్ధికి పట్టం కట్టి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.