Breaking News

కాంగ్రెస్, బీజేపీకి రైతుల ప్రయోజనాలు పట్టవు

కాంగ్రెస్, బీజేపీకి రైతుల ప్రయోజనాలు పట్టవు
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ప్రయోజనాలు పట్టవని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం కేంద్రానికి సహకారం అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు మీల్లింగ్ ఎగుమతి అంతా ఎఫ్​సీఐ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు సివిల్ సప్లై శాఖ కేంద్రానికి లేఖ రాసినా కూడా స్పందన లేదని అన్నారు. వాళ్లు బియ్యం తీసుకోకుండా పంపలేదని రాష్ట్రాన్ని బదనం చేస్తున్నారని ఆరోపించారు. రైస్, బాయిల్డ్ రైస్ కు తేడా తెలియని బీజేపీలు నేతలు, ఎంపీలు ఉండడం మన దురదృష్టకరమని అన్నారు. దేశంలో ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్  రైతుల పక్షాన మాట్లాడకుండా చేతులెత్తేసిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారని, రైతుల కోసం పార్లమెంట్లో బయట పోరాడుతున్నది టీఆర్ఎస్ అని అన్నారు. యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని  స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.