మార్కండేయ రిజర్వాయర్ సందర్శనకు మాజీమంత్రి నాగం
బీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ..తోపులాట
గిరిజన కార్యకర్తను కిందపడేసిన తొక్కిన బీఆర్ఎస్ లీడర్
వీడియో వైరల్.. ఇరుపార్టీల కార్యకర్తలపై కేసులు
సామాజికసారథి, నాగర్ కర్నూల్: మమ్మాయిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఒక్కసారిగా సినిమా సీన్ ను తలపించింది. చాలా మంది సోషల్ మీడియాలో ఫోటో చూసి సంకురత్రికి ఫ్యాషను బాలయ్య సినిమా వీరసింహ రెడ్డి లేక వా లుతెరు వీరయ్య చిరంజీవి సినిమా అనుకొని కామెంట్ చేస్తరు …. కాదు శనివారం బిజినేపల్లి మండలంలోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ లో బీ అర్ ఎ స్ అగ్రవర్ణ నాయకులకు ఎదురు తిరిగిన దళిత , గిరిజన బిడ్డలను కాలు కింద వేసి సినిమా టైపు జరిగింది. ఇరుపక్షాల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి రిజర్వాయర్ ను పరిశీలించేందుకు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అప్పటికే పెద్దమొత్తంలో అక్కడికి చేరుకున్నారు. రిజర్వాయర్ ను పరిశీలిస్తుండగా అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సీనియర్ నేత జనార్దన్ రెడ్డితో వాదనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో వివాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త వాల్యానాయక్ తో గొడవపడి అంతటితో ఆగకుండా వాల్యా నాయక్ పై చేయి చేసుకున్నారు. కిందపడవేసి గొంతుపై కాలుపెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుండి నిష్క్రమించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బిజినేపల్లి పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ప్రాజెక్టును సందర్శించడానికి వస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని గరం గరం అయ్యారు. ఈ సంస్కృతి మంచిది కాదని హెచ్చరించారు. ప్రాజెక్టు కోసం మంత్రి కేటీఆర్ శిలాఫలకం వేశారు ఇప్పటివరకు తట్టమన్ను కూడా తీయకపోవడం దారుణమని ఆరోపించారు.
9మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు
మార్కండేయ రిజర్వాయర్ పనుల సందర్శన సందర్భంగా సాయిన్ పల్లి సర్పంచ్ స్రవంతితో కాంగ్రెస్ కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంటూ 9 మంది కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేశారు.