Breaking News

MANAVAPADU

నేడే రంజాన్ పండగ

నేడే రంజాన్ పండగ

సారథి, మానవపాడు: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని, అందరూ సుఖశాంతులతో జీవనం కొనసాగించాలని ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జామియా మసీదు ముతవల్లి మహబూబ్ పాషా కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ చేసుకోవాలని కోరారు.

Read More
మేమున్నాం..

మేమున్నాం..

సారథి, మానవపాడు: కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు. ఒకరికొకరు కలిసి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామనికి చెందిన ఎండీ ఖాజాహుస్సేన్ నెలన్నర రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పదో తరగతి పూర్వవిద్యార్థులు (1998-99) రూ.63,500 ఆర్థికసాయం చేశారు. బొంకూర్ గ్రామానికి వెళ్లి మృతుడు ఎండీ ఖాజాహుస్సేన్ సతీమణి సైనాజ్ బేగం కుటుంబసభ్యులకు అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు […]

Read More
బాలయోగి ఇక లేరు

బాలయోగి ఇక లేరు

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురంలో బాలయోగి శివనారాయణస్వామి కన్నుమూశారు. స్వామివారు 76 ఏళ్లుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శివనారాయణ స్వామి ఇక లేరనే వార్తను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివనారాయణ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు విశేషసంఖ్యలో తరలివచ్చేవారు. స్వామివారు లేక లేరని భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read More
కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

సారథి, మానవపాడు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సవిత సూచించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నేషన్ నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా నివారణ టీకాను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఆమె సూచించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకొచ్చి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా కాళ్లు, చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని […]

Read More
వెయ్యి కుటుంబాలకు సరుకులు పంపిణీ

వెయ్యి కుటుంబాలకు సరుకులు పంపిణీ

సారథి, మానవపాడు: యునైటెడ్ వే ఆఫ్ ఇండియా బొంబాయి సంస్థ వారు రాజోలి చేనేత శ్రామిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో రాజోలి గ్రామంలో వెయ్యి చేనేత కార్మిక కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా ఉండటంతో చేనేత మగ్గాలు నడవక చాలా కుటుంబాలకు తినడానికి కూడా తిండిలేక పస్తులు ఉంటున్నాయి. అలాంటి వారికి తమవంతుగా సాయం చేస్తున్నారు. చేనేత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కో ఆప్షన్ సభ్యుడు నిషాక్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]

Read More
45 ఏండ్లు నిండినవారు వ్యాక్సిన్​ తీసుకోండి

45 ఏండ్లు నిండినవారు వ్యాక్సిన్​ తీసుకోండి

సారథి, మానవపాడు: ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మానవపాడు పీహెచ్​సీ డాక్టర్​శశికిరణ్​కోరారు. శనివారం స్థానిక మానవపాడు పీహెచ్​సీని గద్వాల డీఐవో డాక్టర్ శశికళ సందర్శించి వార్డుల రూములను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయానికి మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? లేదా? ఏమైనా ఆరోగ్య విషయంలో ఇబ్బంది వస్తే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నారా? లేదా? అన్న అంశాలను ఆరాతీశారు. 45 ఏండ్లు పైబడిన వారు తప్పకుండా కరోన టీకాను వేయించుకోవాలని […]

Read More
ఆటలతో మానసిక ఉల్లాసం

ఆటలతో మానసిక ఉల్లాసం

సారథి, మానవపాడు: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తూ అందరి శ్రేయస్సు కోసం కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ మెడికల్ హుస్సేన్ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉపవాసాలు చేస్తూ సాయంత్రం వేళల్లో యువకులు ఆహ్లాదం కోసం కాసేపు క్రికెట్ ఆడటం సంతోషమన్నారు. క్రీడాకారులను దృష్టిలో ఉంచుకుని ఆయన రూ.ఆరువేల క్రికెట్ కిట్టును మానవపాడులోని జామియా మసీదు ఆవరణలో అందజేశారు. అలాగే వీఆర్వో హుస్సేన్ రూ.వెయ్యి నగదు, షాకీర్ […]

Read More
45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్​ తీసుకోవాలి

45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్​ తీసుకోవాలి

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు హెల్త్​సెంటర్​ను డీఎంహెచ్​వో డాక్టర్​చందునాయక్ సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. 45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా సెకండ్​వేవ్​ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైద్యులు, డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అమరవాయి గ్రామంలో ఉన్న హెల్త్​సబ్ సెంటర్ ను పరిశీలించి అక్కడ ఉన్న వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]

Read More