Breaking News

TELANGANA

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

సారథి న్యూస్, హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు డిమాండ్​చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.5,420 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్ లో జమచేసి వాడుకుంటుందని వివరించారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిరాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు హాజరయ్యారు. బీఆర్కే భవన్ నుంచి మంత్రి టి.హరీశ్​రావు […]

Read More
డిజిటల్ విప్లవం వైపు తెలంగాణ

డిజిటల్ విప్లవం వైపు తెలంగాణ

కొవిడ్ సంక్షోభ అనంతరం అనేక అవకాశాలు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. తెలంగాణ ప్రపంచంలోని అనేక పెట్టుబడులకు ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని, అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​పాల్గొన్నారు. రెండు […]

Read More
సీఎం కేసీఆర్​సంకల్పం గొప్పది

సీఎం కేసీఆర్​ సంకల్పం గొప్పది

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం కె.చంద్రశేఖర్​రావు నెరవేర్చుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పాలకుడి సంకల్పం గట్టిగా ఉంటే ఆ దేవుడు కూడా కరుణిస్తాడని, రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు నిరూపించాయని అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకుని రైతుల కళ్లల్లో సంతోషం చిగురించేలా చేశాయన్నారు. నల్లగొండకు గోదావరి, కృష్ణాజలాలను తరలించి సీఎం కేసీఆర్​ రైతుల పాలిట దేవుడయ్యారని కొనియాడారు. […]

Read More
వీసీల నియామక ప్రక్రియ వేగవంతం

వీసీల నియామక ప్రక్రియ వేగవంతం

సారథి న్యూస్, హైదరాబాద్: యూనివర్సిటీ వైస్ చాన్సలర్ల(వీసీ) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, తుది కసరత్తు జరుగుతోందని వివరించారు. సెప్టెంబర్ ​7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులు, ​ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం […]

Read More
పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి

పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను తీసుకుని నిరుపయోగంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తున్నామని వెల్లడించారు. కంపెనీలు కూడా ఇచ్చిన హామీల మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించని వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని […]

Read More
ఫిష్ హబ్ గా.. తెలంగాణ

ఫిష్ హబ్ గా.. తెలంగాణ

సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా లింగంపేట చెరువులో 1.08లక్షల చేపపిల్లలను సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ ఆలోచన విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతుందన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో పుష్కలంగా చేపలు ఉన్నాయని అన్నారు. 2020- 21 సంవత్సరానికి జగిత్యాల జిల్లా సమీకృతం మత్స్య అభివృద్ధి పథకం కింద 18 మండలాల్లో 1.46 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ […]

Read More
విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాలు

విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాలు

సర్కారు స్కూళ్లలో సెప్టెంబర్​ 1 నుంచి క్లాసెస్​ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: మానవాళిని కరోనా వణికిస్తున్న వేళ.. విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పనున్నారు. ఇప్పటికే ఆయా చానళ్లతో ఒప్పందం కుదిరింది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈనెల 27 నుంచి విధులకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే కరోనా […]

Read More
2,579 కేసులు.. 9 మరణాలు

2,579 కేసులు.. 9 మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం(24 గంటల్లో) 2,579 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, రాష్ట్రంలో తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 770 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,670గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 23,737 ఉన్నాయి. తాజాగా 1,752 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 84,163కు చేరింది. అత్యధికంగా హైదరాబాద్​పరిధిలో 295 కేసులు నమోదు నమోదయ్యాయి. జిల్లాల వారీగా […]

Read More