Breaking News

TELANGANA

కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి మరింత పెరుగుతోంది. శుక్రవారం(24 గంటల్లో) 2,478 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 866కు చేరింది. వ్యాధి బారినుంచి ఒక్కరోజే 2,011 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,02,024కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 32,994 ఉన్నాయి. […]

Read More
ప్రతి సమాచారం మీ వద్ద ఉండాలి

ప్రతి సమాచారం మీ వద్ద ఉండాలి

సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ కే భవన్ లో అన్నిశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నిశాఖలు తమకు సంబంధించిన సమగ్ర సమాచారం తయారు చేయాలని, శాసనమండలి, శాసనసభలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని, అసెంబ్లీ అధికారులతో […]

Read More
ప్రజాసమస్యలపై సంపూర్ణంగా చర్చిద్దాం

ప్రజాసమస్యలపై సంపూర్ణంగా చర్చిద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్నిఅంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయపక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈనెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ మంత్రులు, విప్ లతో గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.మంత్రులు సన్నద్ధమై రావాలికరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో […]

Read More
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

భువనగిరి: యశోద ఆస్పత్రి యాజమాన్యం కోసమే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి ప్రజలను కాపాడేందుకు వినియోగించాలని హితవు పలికారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వసతులను తెలుసుకునేందుకు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం గురువారం భువనగిరి జిల్లా ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంతా ఉద్యోగాల కోసమే అన్న రాజేంద్రా.. ఇప్పటి […]

Read More
కరోనా మిగిల్చిన కన్నీటి వ్యథలు

కరోనా మిగిల్చిన కన్నీటి వ్యథలు

ప్రపంచమంతా ఆధునికత వైపు ముందుకెళ్తుంటే.. కాయకష్టాన్ని నమ్ముకున్న వలస కూలీ మాత్రం ఓ పూట తిండి కోసం ఇప్పటికీ అల్లాడుతున్నాడు. ఇలాంటి కన్నీటి గాథలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అయితే ఈ బక్కపల్చటి బతుకుల్లో అంతకుమించిన ఆవేదనను మిగిల్చింది కరోనా. మరీ ముఖ్యంగా మహిళలకు మనసు చెలించే కథలనే రాసింది. కాలం చేసిన గాయాల్లో ఎందరో ఆడ కూతుళ్ల కన్నీటి బొట్లకు ఇవి కొన్ని సాక్ష్యాలు మాత్రమే. రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించాలని కలలో కూడా కోరుకోని […]

Read More
తెలంగాణలో 2,817 కేసులు

తెలంగాణలో 2,817 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) 2,817 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో చేరిన కరోనా సంఖ్య 1,33,406కు చేరింది. తాజాగా వ్యాధిబారినపడి 10 మంది మృతిచెందారు. కరోనా మృతుల సంఖ్య 856కు చేరింది. వ్యాధి నుంచి తాజాగా 2,611 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,00,013 కు చేరింది. ప్రస్తుతం 32,537 యాక్టివ్​కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్​లో 25,293 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 452 కేసులు నమోదయ్యాయి. ఇలా జిల్లాల […]

Read More

మొగిపురుగును నివారించండిలా..

సారథిన్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను మొగిపురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరేశ్​, రవి పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయశాస్త్రవేత్తలు మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని జెడ్​ చెర్వు, బచ్చురాజ్ పల్లి, నందిగామ గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంట లో మొగిపురుగు నివారణకు నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడొద్దని సూచించారు. అగ్రిమైసిన్ 0.4 గ్రామ్ లేదా క్లోరిఫైరిఫాస్ 2 ఎం ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]

Read More