Breaking News

విద్యార్థులే స్వీపర్లు

విద్యార్థులే స్వీపర్లు
  • చిన్నారులతో వెట్టిచాకిరీ
  • చర్యలు తీసుకుంటామన్న డీఈవో

సామాజిక సారథి, కౌడిపల్లి: ప్రభుత్వ స్కూళ్లలో చిన్నారులే స్వీపర్లుగా మారారు. మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చీపురుపట్టి ఊడ్చారు. టీచర్లు కూడా వారిచేత పనులు చేయించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 600, జడ్పీ హైస్కూళ్లు 140 దాకా ఉన్నాయి. దాదాపు సగం స్కూళ్లలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. స్వీపర్లను ఈ ఏడాది నియమించకపోవడంతో పిల్లలే అన్ని పనులు చేస్తున్నారు. తాజాగా మహమ్మద్​నగర్​స్కూలులో విద్యార్థులే పరిసరాలను ఊడ్చుకున్నారు. ప్రభుత్వం స్వీపర్లను నియమించడం లేదని, తమ పిల్లలను బడికి పంపితే ఇలా పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఈవో రమేష్​ను వివరణ కోరగా.. స్కావెంజర్లను ఈసారి ఎక్కడా నియమించలేదని, గ్రామపంచాయతీ స్వీపర్ల చేత స్కూళ్లలోని చెత్తను తీసివేయించాలని చెప్పారు. స్కూళ్లలో విద్యార్థులతో పనులు చేయిస్తే అలాంటి టీచర్లపై యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తామన్నారు.