*శ్రీను మృతికి కారకురాలైన ప్రిన్సిపల్, వార్డెన్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*
*బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి*
*తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్
సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో :ధర్మాపూర్ మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల లో ఆరవ తరగతి చదువు తున్న విద్యార్థి శ్రీను అనుమానస్పద గా బుధవారం మృతి చెందారు.హన్వాడ మండల కేంద్రానికి చెందిన బ్యాకరి కృష్ణయ్య అంజమ్మల దంపతుల రెండవ కుమారుడైన శ్రీను మహబూబ్నగర్ రూరల్ మండలం మన్నెంకొండ (ధర్మాపూర్ ) గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.దళిత విద్యార్థి బ్యాగరి శ్రీను మంగళవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాల పై క్రింద పడ్డారని సమాచారం. సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు గాంధీ కి రెఫర్ చేశారు. అనంతరం హైదరాబాద్ లో గాంధీ లో చికిత్స పొందుతూబుధవారం సాయంత్రం చనిపోయినట్లు తెలిసింది. విద్యార్థి తల్లి దండ్రలకు ముందుగా ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ప్రాణం తీసిన,శ్రీను మృతి కి కారకులైన ప్రిన్సిపల్, వార్డెన్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు.మూడంతస్తుల భవనం పైనుంచి కింద పడినట్లయితే చుక్క రక్తం బొట్టు కూడా కారలేదని, అంతేకాక కనీసం ఎక్కడ కూడా శరీరానికి దెబ్బలు తాకిన దాఖలాలు లేవని తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, రెండు పడకల ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య బ్యాగరి శ్రీను పార్థిహదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు, జిల్లా అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు ధర్పల్లి బాలకృష్ణయ్య,బైండ శ్యాంసుందర్, జిల్లా ప్రచార కార్యదర్శి ధర్పల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.