Breaking News

సమ్మె విరమణ… విధుల్లో చేరిక

సమ్మె విరమణ... విధుల్లో చేరిక
  • విధుల్లో చేరిన గణపతి కార్మికులు
  • సమ్మె విరమణ, విధుల్లో చేరిక

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: నూతన వేతన సవరణ చేయాలంటూ గత 34రోజులుగా గణపతి చక్కెర పరిశ్రమ కార్మికులు కార్మికులు సమ్మె చేస్తుంన్రు. కార్మికుల సమ్మె న్యాయబద్దంగా ఉండడంతో కార్మికుల డిమాండ్లను అంగీకరిస్తూ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సమక్షంలో యాజమాన్యానికి, కార్మికుల మధ్య ఒప్పందం కుదిరింది. దుబ్బాక ఎమ్మెల్యే, చక్కెర పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షుడు రఘునందన్ రావు నేతృత్వంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ సమ్మె శిభిరం వద్దనున్న కార్మికులకు తాత్కాలికంగా రూ.700 ఇంక్రిమెంట్ చెల్లించినట్లు ఆయప పేర్కొన్నారు. నూతన వేతన సవరణ ఒప్పందాన్ని 60రోజుల్లో పూర్తి చేయనున్నట్టు పరిశ్రమ యాజమాన్యం హామీ ఇచ్చిందని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీశైలం తెలిపారు. చెరుకు క్రషింగ్ సీజన్ ముగిసిన తర్వాత అగ్రిమెంట్ చేయడం జరుగుతుందని కార్మిక సంఘం, గణపతి చక్కెర పరిశ్రమ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నాయి. దీంతో కార్మికులు శనివారం సమ్మె విరమించి విధుల్లో చేరారు.