సారథి న్యూస్. రామగుండం: సింగరేణి వార్షిక లాభాల్లో కార్మికులకు వాటా ఇప్పించడానికి కృషి చేస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో మాట్లాడతామని చెప్పారు. మంగళవారం లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశంలో వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2400 మంది బదిలీ వర్కర్ లను జనరల్ మజ్దూర్ గా ప్రమోషన్ సాధించి ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ దే అని చెప్పారు. సమావేశంలో టీడీజీకేఎస్ ఉపాధ్యక్షుడు శంకర్, దేవ వెంకటేశం, కృష్ణ, పరస బక్కయ్య, ఎన్ మల్లేష్, జీ శ్రీనివాస్, వీవీ గౌడ్, కొయ్యడ శ్రీనివాస్, డీ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
- October 6, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- HYDERABAD
- LABOUR
- SINGARENI
- TELANGANA
- కార్మికులు
- యాజమాన్యం
- సింగరేణి
- హైదరాబాద్
- Comments Off on సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా