- టాటా ఏరోస్టక్చ్రర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్ రంగం ఐదేళ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఏరోస్పేస్ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మంగళవారం ఆదిభట్లలో టాటా ఏరోస్టక్చ్రర్లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిన్ హైదరాబాద్‌గా ఫైటర్ వింగ్స్ తయారుచేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్ తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగాయనడానికి.. ఎఫ్ 16 వింగ్ సర్టిఫికేషన్, డెలివరీ గొప్ప సాక్ష్యంగా నిలిచాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఇండియాలోనే తెలంగాణ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తుందని వివరించారు.