Breaking News

సమంత స్పెషల్‌సాంగ్‌

సమంత స్పెషల్‌సాంగ్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘పుష్ప’లో సమంత స్పెషల్‌సాంగ్‌చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌జరుగుతోంది. ఈ స్పెషల్‌సాంగ్‌త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ.. సమంత లుక్‌ను విడుదల చేసింది. లంగా జాకెట్‌ధరించి, మాస్‌లుక్‌లో బ్యాక్‌సైడ్‌మాత్రమే కనిపిస్తున్న సమంత ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. ‘సిజ్లింగ్‌సాంగ్‌ఆఫ్‌ది ఇయర్‌’గా  వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌స్వరాలు సమకూర్చారు. బన్నీ, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌కాంబినేషన్‌లో వచ్చే స్పెషల్‌సాంగ్‌ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. దీనికితోడు తోడు సమంత చేస్తున్న తొలి స్పెషల్‌సాంగ్‌ఇది.. ఈ మూవీ ఫస్ట్‌పార్టును డిసెంబర్‌17న విడుదల చేయనున్నారు.