Breaking News

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పీ

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పీ

సామాజిక సారథి, హైదరాబాద్​: ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణమాదిగను బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. విద్యానగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు చౌటి ప్రభాకర్​, అనిల్​ తదితరులు ఉన్నారు.