Breaking News

పాలమూరు ప్రజా దీవెన సభను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి


సామజిక సారథి, నాగర్ కర్నూల్:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS కాలేజీ ప్రాంగణంలో సాయంత్రం 4-00 గంటలకు నిర్వహించే పాలమూరు ప్రజాదీవెన సభ ను విజయవంతం చేయాలనీ నాగర్ కర్నూల్ ఏమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఈ సభ ధార పూరించనున్నారని, ఇట్టి ప్రజా దీవెన సభకు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గత పదేళ్లుగా ప్రజల సమస్యలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాల్లో నాలుగింటిని అమలు చేస్తున్నామని, త్వరలో మే 11 వ తేదీన భద్రాచలం శ్రీ రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అంకురార్పణ చేస్తారాని తెలియజేశారు. బిఆర్ఎస్ అడ్డగోలు పరిపాలనతో ఖజానా దివాలా తీసిన, ఆర్థికంగా ఇబ్బందులను ఉన్న, ప్రజలకిచ్చిన హామీలు గ్యారెంటీ ల ను నేరవారస్తా మని తెలిపారు.